Saturday, November 23, 2024
Homeసినిమారాజకీయాల పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

రాజకీయాల పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

చిరంజీవి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ‘ప్రజారాజ్యం‘ అనే పార్టీ స్థాపించి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే.. రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరడం.. ఆలోచిస్తానని చిరంజీవి చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కొన్నాళ్లు పార్టీని నడిపించినప్పటికీ.. ఏమైందో ఏమో కానీ.. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ఆతర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చేశారు మెగాస్టార్.

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆతర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. అయితే.. చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని పొలిటికల్ లీడర్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంకా తమ పార్టీలోనే ఉన్నారని తెలియచేస్తూ.. ఐడీ కార్డ్ ఇచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు చిరంజీవిని పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ లీడర్స్ చిరంజీవిని కలవడంతో నిజంగానే చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా అనే డౌట్ స్టార్ట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఇంకోసారి సినిమాలను వదిలేసే ప్రసక్తే లేదు అన్నారు. ఒక మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ స్థాయి వరకు ఎదగటానికి కారణం సినిమా తల్లి. ఈ చిత్రసీమకే నేను రుణపడి ఉంటాను. ఇంత అభిమానం, ప్రేమ, గౌరవం సినిమాల వల్లే పొందాను. సినిమాలు ఎప్పటికీ వదలను అని చిరంజీవి అన్నారు. 53వ ఇఫీ ముగింపు ఉత్సవాల్లో ఆయన ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ పురస్కారం పొందారు. ఈ సందర్భంగా చిరంజీవి ఈ విషయాన్ని చెప్పారు. ఇక రాజకీయాలకు దూరం అని ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చారు మెగాస్టార్. అదీ.. సంగతి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్