Thursday, March 19, 2026
Homeసినిమామేఘ ఆకాష్ కొత్త సినిమా ప్రారంభం

మేఘ ఆకాష్ కొత్త సినిమా ప్రారంభం

Megha Akash: ‘డియర్ మేఘ’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ మరో మంచి లవ్ స్టొరీ సైన్ చేసింది. ఈ చిత్రానికి డియర్ మేఘ దర్శకుడు సుశాంత్ రెడ్డి కథ అందించడంతో పాటు నిర్మాణంలో కూడా  భాగస్వామ్యం వహిస్తున్నారు. సుశాంత్ రెడ్డి.ఏ & అభిషేక్ కోట నిర్మాణంలో, మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. మేఘ ఆకాష్ హీరొయిన్ గా రూపొందబోతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకుడు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “డియర్ మేఘ లాంటి హిట్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ తో మా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంపై చాలా అంచనాలున్నాయి. దర్శకుడు అభిమన్యు బడ్డిపై మాకు చాలా నమ్మకముంది. ముఖ్య నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నాం. షూటింగ్ కూడా అతి త్వరలో మొదలవుతుంది” అన్నారు.

Also Read : ‘ధమాకా’ లో ప్రణవిగా శ్రీ‌లీల ఫ‌స్ట్ లుక్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular