Friday, February 21, 2025
Homeసినిమాబాలయ్య సరసన మెహ్రీన్?

బాలయ్య సరసన మెహ్రీన్?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న అఖండ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య.. క్రాక్ మూవీ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. ఇందులో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించలేదు.

ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ లేదా త్రిష నటించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం మెహ్రీన్‌ ను సంప్రదించినట్టు తెలిసింది. బాలయ్య సరసన నటించే అవకాశం రావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ కు ఓకే చేప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆమె పాత్రకు పారితోషికం కూడా బాగానే ఆఫర్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల మెహ్రీన్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈపాటికే మ్యారేజ్ జరగాల్సింది కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఇలాంటి టైమ్ లో బాలయ్య సరసన నటించే ఆఫర్ రావడం నిజమైతే.. క్రేజీ ఆఫరే. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్