Saturday, January 18, 2025
Homeసినిమాఇప్పుడు హిట్టు పడకపోతే మెహ్రీన్ కి చానా కష్టమే!

ఇప్పుడు హిట్టు పడకపోతే మెహ్రీన్ కి చానా కష్టమే!

Mehreen Need: తెలుగు తెరపై తొలి సినిమాతోనే హిట్ కొట్టేయడం .. తొలి సినిమాతోనే కుర్ర మనసులకు కుదురు లేకుండా చేయడం చాలా తక్కువమంది విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సక్సెస్ ను అందుకున్న మెహ్రీన్ అందగత్తె  మాత్రమే కాదు .. అదృష్టవంతురాలు అనిపించుకుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో పరిచయమైన ఈ సుందరిని చూసిన కుర్రాళ్లు ఆ క్షణంలోనే ఆమె అభిమానులుగా మారిపోయారు. ఇకపై కూడా ఆమె సినిమాలను ఫస్టు డే  .. ఫస్టు షో చూసేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ తరువాత కూడా మెహ్రీన్ ను ‘మహానుభావుడు’ .. ‘ రాజా ది గ్రేట్’ వంటి సక్సెస్ లు పలకరించాయి. దాంతో ఇక కొంతకాలం పాటు ఈ పాలపిల్లకి ఢోకా లేదని అంతా అనుకున్నారు. కానీ వరుస పరాజయాలు ఆమెను సతమతం చేశాయి. అలాంటి సమయంలోనే ఆమెను ‘ఎఫ్ 2’ ఆదుకుంది. ఈ సినిమాలోని హానీ పాత్రలో ఆమె చేసిన అల్లరి అంతా  ఇంతా కాదు. ఈ సినిమా తరువాత కూడా ఆమె చకచకా తన ఖాతాలో హిట్లు వేసుకోలేకపోయింది. అదే సమయంలో పెళ్లి కుదరడంతో అవకాశాలు తగ్గించుకుంది. ఆ తరువాత మనసు మార్చుకుని  మళ్లీ సినిమాలు కంటిన్యూ చేస్తోంది.

అయితే ఈ నేపథ్యంలో ఆమె సన్నబడటం .. కాస్త గ్లామర్ తగ్గడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్లీ ఆమె  హీరోయిన్స్ రేసులో ముందుకు వెళ్లడానికి ఆరాటపడుతోంది. చేతిలో సినిమాలు లేని పరిస్థితుల్లో ఆమెకి ‘ఎఫ్ 3’ ఆశాకిరణంలా మారింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో తమన్నా ..  సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డే వంటి అందగత్తెలు ఉన్నారు. వాళ్ల ముందు తేలిపోకుండా మెహ్రీన్ చూసుకోవాలి. హిట్ లో కొంత తన  ఖాతాలోను పడేలా చేసుకోవాలి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనీ .. తన కెరియర్ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్