Sunday, January 19, 2025
HomeTrending Newsనెల్లూరు పర్యాటకం అభివృద్ధి చేయండి

నెల్లూరు పర్యాటకం అభివృద్ధి చేయండి

Mekapati met Kishan Reddy: 

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు పరిసరాలు సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పలు ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మేకపాటి నేటి ఉదయం కిషన్ రెడ్డిని కలుసుకున్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యాటకాభివృద్ధిపై పలు ప్రతిపాదనలను కిషన్ రెడ్డికి మేకపాటి సమర్పించారు. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలను ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న ఇతర పర్యాటక ప్రదేశాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు.  టెంపుల్ టూరిజం అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి మేకపాటి తెలియజేశారు.

Also Read :కిషన్ రెడ్డికి పర్యాటకం, ఈశాన్యం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్