Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమనసులు విలవిల మందుల కళ కళ

మనసులు విలవిల మందుల కళ కళ

Mental Health During Pandemic :

Minding our minds during the COVID-19 

కరోనా ఫస్ట్ వేవ్ అవగానే హమ్మయ్య ఇంక పర్వాలేదనుకున్నారు చాలామంది. ఆ సంతోషం నిలబడకుండా సెకండ్ వేవ్ అకస్మాత్తుగా దెబ్బతీసింది. హితులు, స్నేహితులు, సన్నిహితుల మరణాలు ఎందరినో మానసికంగా దెబ్బ తీశాయి. మన ఇంట్లో వారికి వస్తుందేమో, ఊళ్ళో ఉన్న అమ్మానాన్నల సంగతి ఎలా అనే ఆలోచనలు వేధించని వారు లేరు. కనిపించని శత్రువునుంచి కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు.

కరోనా వల్ల ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి గానీ ఆరోగ్య, ఔషధ పరిశ్రమలు మాత్రం కళ కళలాడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు కాకుండా మానసిక సమస్యలూ ఎక్కువ కావడంతో సంబంధిత మందులూ బాగా అమ్ముడవుతున్నాయని వార్త. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ అవాక్స్ గత ఆరునెలల్లో ప్రధాన నాడీ వ్యవస్థకు సంబంధించిన మందుల అమ్మకాల్లో 13 శాతం పెరుగుదల ఉందంటోంది. ఇది గత సంవత్సరం కంటే సుమారు ఎనిమిది శాతం ఎక్కువ. భారత్ లాంటి దేశాల్లో ఇది చాలా ఎక్కువ. కరోనా తాలూకు ఆందోళనలే ఇందుకు కారణమంటున్నారు మానసిక వైద్యులు.ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం, ఎవరూ పలుకరించక పోవడం వల్ల మతిమరుపు వ్యాధిగ్రస్తుల్లో గందరగోళం, అర్థం లేని మాటలు పెరుగుతున్నాయి. బంధువులు ఆస్పత్రి పాలు కావడం, మరణించడం మరి కొందరిలో తీవ్ర ఆందోళన, డిప్రెషన్ కు దారితీస్తోంది.

కరోనా వచ్చి తగ్గిన వారిలో కూడా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో మానసిక వైద్యులను సంప్రదించడం, మందులు వాడటం పెరిగింది. అవాక్స్ లెక్కల ప్రకారం జూన్ వరకు జరిగిన 2,410 కోట్ల రూపాయల మందుల అమ్మకాల్లో 632 కోట్లు యాంటీ డిప్రెసెంట్స్, 270 కోట్ల యాంటీ సైకోటిక్ మందులు ఉన్నాయి.

మొత్తం మీద మతి కోసం మితిమీరి మందులు వాడే వారి సంఖ్య పెరిగిందనేది స్పష్టం.

-కె. శోభ

Read More: నిత్య భారసహిత స్థితి

Read More: పరిహాసానికి కూడా పరిమితి ఉండాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్