Thursday, March 19, 2026
HomeTrending NewsSuryapeta: ఉద్యమాల గడ్డ సూర్యాపేట - మంత్రి జగదీష్ రెడ్డి

Suryapeta: ఉద్యమాల గడ్డ సూర్యాపేట – మంత్రి జగదీష్ రెడ్డి

ప్రజా ఉద్యమాలకు సూర్యాపేట పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ ఉద్యమం వెనుక వ్యాపార వర్గాలు కీలక పాత్ర వహించారని ఆయన ప్రశంశించారు. నాటి నైజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద నుండే పోరాటం ప్రారంభమయిందన్నారు. ఆ పోరాటం వెనుక ముఖ్య భూమిక పోషించింది వ్యాపార వర్గాలే ఆన్న నగ్న సత్యాన్ని విసనరించారదన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఆర్యవైశ్య ప్రముఖులతో ఇష్టా గోష్టిగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. వ్యాపారంతో పాటు సమాజ సేవలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న వర్తక వ్యాపార వర్గాలు నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు,నిన్నటి వేరు తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి లుదారని ఆయన గుర్తుచేశారు. నైజం పాలనకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది సూర్యాపేట లోనే నని అది కుడా వర్తక వ్యాపార వాణిజ్య వర్గాల ప్రోత్సాహం తోటే అని ఆయన తెలిపారు. ఆ తరువాత 1969 తెలంగాణ ఉద్యమం మొదలు, 1972లో జరిగిన జై ఆంద్రా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలైంది కుడా చైతన్యానానికి మారు పేరుగా నిలిచిన సూర్యపేట నుండే అని ఆయన అన్నారు.

ఆ క్రమంలో 1998 ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ జనసభ పేరుతో వేరు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన నేల కుడా సూర్యాపేటే అని ఆయన చెప్పారు. అటువంటి గడ్డ మీద నుండే బహుబందాలను దూరం చేసుకొని బొమ్మగాని ధర్మభిక్షం, ఆస్తి పాస్తులను వదులు కొని భీమిరెడ్డి నరసింహా రెడ్డి,నిజాయితీకి ప్రతిబింబంగా నిలిచిన ఉప్పల మలుసురు లు సూర్యపేట బిడ్డలు కావడం మనం గర్వ పడే అంశమన్నారు. ఎక్కడా ఆర్యవైశ్యులు వ్యాపారానికే పరిమితము కాలేదని వారి ప్రొత్సహంతోటే ఉద్యమాలు సాగాయని ఆయన గుర్తుచేశారు. మొన్నటికి మొన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో బాలభవన్ ఏర్పడింది అంటే అది ముమ్మాటికి వనమా వెంకట్రామయ్య గొప్పతనమేనని ఆయన కొనియాడారు. అటువంటి వారిని స్మరించుకునేందుకే ఈ నెల 16 న సూర్యపేట జిల్లా కేంద్రంలో సేవాంకిత సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మీలా మహాదేవ్,మోరిశెట్టి శ్రీనివాస్, ఉప్పల ఆనంద్,తోట శ్యామ్, బండారు రాజా, రాచర్ల కమలాకర్,మీలా వంశీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లలితా ఆనంద్,గుండా శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular