Sunday, March 8, 2026
Homeసినిమా‘లైగర్’ లో మైక్ టైసన్

‘లైగర్’ లో మైక్ టైసన్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లైగర్’. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. లైగర్‌లో లెజెండరి బాక్సర్, వరల్డ్ బాక్సింగ్‌ మాజీ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

బాక్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కెన ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌లో అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ మూవీ రూపొందుతోంది. మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నారని ప్రకటించిన సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌, బాక్సింగ్‌లో లెజెండ్‌ మైక్‌ టైసన్‌ గారిని లైగర్‌ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో జర్నీ ప్రారంభించబోతున్నాం. “ది బ్యాడెస్ట్‌ మ్యాన్‌ ఆన్‌ ది ప్లానెట్‌, బాక్సింగ్‌ గాడ్‌, ది లెజెండ్‌, ది బీస్ట్‌, ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ ఐరన్‌ మైక్‌ టైసన్‌” అని అన్నారు.

ప్రస్తుతం లైగర్ మూవీ గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. థాయిలాండ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కెచ్చా యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్‌  చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ విడుదల ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular