ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో రూ.8.30 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
అనంతరం రూ.16 లక్షలతో నిర్మించిన పార్లపాడు గ్రామ పంచాయతీ నూతన భవనం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామంను ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే భట్టి విక్రమార్కా, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , PD DRDO విద్యా చందన , DPO ప్రభాకర్ , సర్పంచ్ తదితరులు ఉన్నారు.
అంతకు ముందు ముదిగొండ మండల కేంద్రంలో(రైతు వేదిక), చిరుమర్రి గ్రామంలో(రైతు వేదిక), పమ్మి గ్రామంలో(రైతు వేదిక), వల్లభి గ్రామంలో(రైతు వేదిక, వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం) ను జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ VP గౌతమ్, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం , వ్యవసాయ అధికారి విజయనిర్మల, DRO శిరీష, RDO రవీంద్రనాధ్ , MPP సామినేని హరిప్రసాద్ , జడ్పీటీసీ పసుపులేటి దుర్గా , మండల వ్యవసాయ అధికారి రాధ , AEO లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు నాయకులు ఉన్నారు.