Saturday, November 23, 2024
HomeTrending Newsవిద్యుత్ వాహనాలకు డిమాండ్ - మంత్రి పువ్వాడ

విద్యుత్ వాహనాలకు డిమాండ్ – మంత్రి పువ్వాడ

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తోందని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకొంటున్నాయని, వివిధ ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే ప్రక్రియలో ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని, ఆ దిశగా అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ప్రముఖ passenger వాహన శ్రేణి ఆటోమొబైల్ సంస్థ Morris Garages(MG) రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

తెలంగాణ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030లో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజును, రోడ్‌ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడం ఇందుకు ప్రధాన కారణమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 4,568 ఈవీలు అమ్ముడయ్యాయని, వీటిలో 3,572 ద్విచక్రవాహనాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వీటన్నిటికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టు మంత్రి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్