Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అసహనం హద్దు మీరింది : మంత్రి అనిల్

అసహనం హద్దు మీరింది : మంత్రి అనిల్

నారా లోకేష్ అసహనం హద్దు మీరిందని, చినబాబు ఫ్రస్ట్రేషన్ బాబుగా మారిపోయాడని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కు ముఖ్యమంత్రి జగన్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ ను రోజూ తిడితే వార్తల్లో చూపిస్తారని జూమ్ మీటింగ్ లు పెట్టుకొని, ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసున్నారని, నాయకుడిగా ఎదిగే లక్షణాలు లోకేష్ లో ఏ కోశానా లేవని అనిల్ విమర్శించారు.

భావితరం ముఖ్యమంత్రి అంటూ లోకేష్ ను ప్రోమోట్ చేస్తున్నారని, కానీ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం తో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోతుందని, కనుచూపు మేర ఆ పార్టీకి భవిష్యత్తు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరిస్థితి అర్ధం చేసుకున్నారు కాబట్టే మీ తండ్రి చంద్రబాబు హైదరాబాద్ కు మకాం మార్చారని లోకేష్ ను ఉద్దేశించి అన్నారు.

గతంలో హెరిటేజ్ కంపెనీతో ప్రభుత్వ పాల సహకార సంఘాలను నిర్వీర్యం చేశారని, రైతులకు మేలు చేసేందుకే సిఎం జగన్ అమూల్ ను తీసుకొచ్చారని అనిల్ వివరించారు. జగన్ ను అమూల్ బేబి అంటూ మాట్లాడడం లోకేష్ కు తగదని, అలాంటి భాష తామూ ఉపయోగిస్తామని హెచ్చరించారు. లోకేష్ ను తాము పప్పు అనలేదని, గూగుల్ లో ఆంధ్రా పప్పు అంటే లోకేష్ పేరు వచ్చిందని గుర్తు చేశారు. నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉండాలని, అంతే తప్ప గడ్డాలు పెంచుకున్న మాత్రాన లీడర్ కాలేరన్నారు.

సిఎం జగన్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ విషయం ప్రస్తావిస్తూ గతంలో చంద్రబాబుకు మోడీ సమయం ఇవ్వకపోతే అది ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు, ఇప్పుడు ఒకరోజు ఆలస్యమైతే జగన్ కు తగిన శాస్తి జరిగింది అంటూ వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి అనిల్ అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ప్రాజెక్టు పురోగతి చూసి కళ్ళలో రక్తం వస్తోందని, రైతుల ఆనందం చూసి ఓర్వలేకపోతున్నారని అనిల్ ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్