Wednesday, May 7, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్యాస్‌ తుఫాన్‌పై అప్రమత్తం: మంత్రి అనిల్

యాస్‌ తుఫాన్‌పై అప్రమత్తం: మంత్రి అనిల్

యాస్‌ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి అనిల్ కుమార్ ఆదేశించారు. తుపాను  ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖపట్నం అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు.  ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు.  చెరువులకు గండ్లు కొట్టకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రాజెక్టుల పురోగతిపై అరా:
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులను వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.  పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు పనుల పురోగతిపై  సమీక్షించారు. R&R పై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలని మంత్రి అనిల్ ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్