Saturday, January 18, 2025
HomeTrending Newsబాబు మానసిక స్థితి బాగాలేదు : అనిల్

బాబు మానసిక స్థితి బాగాలేదు : అనిల్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు ఒర్వలేకపోతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. రెండేళ్లలో చంద్రబాబు మానసిక స్థితి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. మొన్న మాక్ అసెంబ్లీ.. నిన్న జూమ్ లో మహానాడు చేసుకుని ప్రభుత్వంపైన చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. పక్క రాష్ట్రంలోఉంటున్న చంద్రబాబు, అక్కడ నుంచే జూమ్ లో మీటింగ్ లు పెడుతూ రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

అసలు తెలుగుదేశం పార్టీ ఎక్కడుందో వెతుక్కోవాలని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు అనిల్. కొన్ని మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకుని, రోజూ క్షుద్ర రాజకీయాలు చేస్తూ, ఎల్లో ఫంగస్ మాదిరిగా రాష్ట్రంపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన అపర భగీరథుడు స్వర్గీయ డాక్టర్ వైయస్ఆర్ అయితే… ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అనిల్ తెలియజేశారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు నాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయస్ఆర్ గారిదైతే…. దానిని 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్న ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) కింద ప్రాజెక్టులు చేపట్టి, కృష్ణా, గోదావరికి సంబంధించి బ్యారేజిలు కట్టి స్టోరేజీ పెంచబోతున్నామని, దాదాపు రూ. 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు.

కోవిడ్ కట్టడిలోనూ సమర్థవంతంగా పనిచేస్తూ, ప్రజలకు ఏ కష్టం రాకుండా, కోవిడ్ ట్రీట్ మెంటును సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి, ప్రజలను కంటికి రెప్పలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు కాపాడుతున్నారన్నారు అనిల్.

జగన్ మోహన్ రెడ్డి గొప్పగా పరిపాలన సాగిస్తున్నారు కాబట్టే, స్థానిక ఎన్నికల్లో 85 శాతం సీట్లు సాధించుకున్నామని, కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళు నోరు ఉంది కదా అని మాట్లాడితే ఎలా..? అంటూ అనిల్ ప్రశించారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో 95 శాతంపైగా హామీలు అమలు చేసి చూపించామని . చెప్పినదానికంటే ఎక్కువే చేశామని స్పష్తం చేశారు. ఏ కష్టం వచ్చినా వెన్ను చూపని నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి అనిల్ కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్