Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్లోకేష్ పై చంద్రబాబుకే నమ్మకం లేదు: అనిల్

లోకేష్ పై చంద్రబాబుకే నమ్మకం లేదు: అనిల్

టిడిపి నేత నారా లోకేష్ పై అయన తండ్రి చంద్రబాబుకే నమ్మకం లేదని, ఇక రాష్ట్రంలోని యువత ఎలా నమ్ముతారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నిన్న నెల్లూరులో లోకేష్ పర్యటన, తనపై చేసిన విమర్శలపై అనిల్ స్పందించారు.  తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్ళపాటు సేవలందించిన నేత చనిపోతే పరామర్శించని నారా లోకేష్ నిరుద్యోగి కమల్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి వచ్చారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా అనిల్ చేసిన వ్యాఖ్యలు:

  • నిరుద్యోగి కమల్ మరణాన్ని అడ్డుపెట్టుకుని  నీచమైన చిల్లర రాజకీయాలు చేయడానికి లోకేష్ నెల్లూరుకు వచ్చాడు
  • మృతుని కుటుంబం లోకేశ్ ను కలవకపోవడం వెనుక నా ప్రమేయం లేదు
  • సిఎం జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదనే  ఆ యువకుడు చనిపోయాడని లోకేష్ వెధవ ప్రచారం చేస్తున్నాడు
  • ఒకేసారి లక్షా ముప్పై వేల సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన చరిత్ర జగన్ ది
  • టిడిపి ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లిస్ట్  బయట పెట్టాలి.
  • నేను కాదు కదా.. లోకేష్ చూసి భయపడేవాడు రాష్ట్రంలో ఎవరూ లేరు
  • కౌన్సిల్ లో ఎన్నోసార్లు నా పరిస్థితేంటో నీ పరిస్థితేంటో చూశాం
  • లోకేశ్  చేతగానితనానికి,   ఫెయిల్యూర్ కు కేరాఫ్ అడ్రస్
  • రాష్ట్రంలో  లోకేష్ ను చూసి ఏ యువత ధైర్యం తెచ్చుకోదు
  • లోకేష్ ను చంద్రబాబే నమ్మడం లేదు. ముందు లోకేష్ తన పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్