Sunday, January 19, 2025
HomeTrending Newsఇళ్ళ పట్టాల పంపిణీ వేగవంతం: అవంతి

ఇళ్ళ పట్టాల పంపిణీ వేగవంతం: అవంతి

Make it fast: కోర్టు తీర్పుకు అనుగుణంగా విశాఖలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి అవంతి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇళ్ళు పట్టాల పంపిణీ విషయంపై క్యాంపు కార్యాలయంలో మంత్రి  సమీక్ష నిర్వహించారు. సిఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నారని చెప్పారు.

భీమిలి నియోజకవర్గంలో మొత్తం 28,000 మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించామని, ప్రతి పక్షాలు కోర్టులో కేసు వేయడం వలన సరైన సమయంలో పేదలకు వీటిని అందించలేక పోయామని, కోర్టు నుండి అనుకూలమైన తీర్పు రావడంతో పంపిణీ పనులను వేగవంతం చేయాలని సూచించారు. భీమిలిలోని మూడు మండలాల్లోని అన్ని గ్రామాలతో పాటు, జీవియంసి పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఉగాది తరువాత ఇళ్ళ పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. ఉగాది తరువాత సిఎం జగన్ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కరపత్రం రూపంలో ముద్రించి ప్రతీ ఇంటికి పంపిణీ చేయాలని నాయకులకు సూచించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ఉగాది పురస్కారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాసింగ్ అధికారులు, యంఆర్వోలు, యండివోలు, జోనల్ కమిషనర్ లు, కార్పోరేటర్ లు, యంపిపి లు, వైస్ యంపిపి లు, జెడ్పిటీసీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్