Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రాంతాల మధ్య బాబు చిచ్చు

ప్రాంతాల మధ్య బాబు చిచ్చు

మొన్నటిదాకా కులాల మధ్య చిచ్చు పెట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు జిల్లాల మధ్య చిచ్చుపెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో తన వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పకుండా, జిల్లాల్లో ఎమ్మెల్యేలతో లేఖలు రాయించడంలో  ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

కృష్ణా జలాలో మన వాటా రాబట్టుకోవడానికి ప్రయాతాలు చేస్తున్నామని, దీనికోసం ఓ వైపు తెలంగాణా తో పోరాడుతుంటే, రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా బాబు ప్రవర్తన ఉందని విమర్శించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని, ఒక దిగువ స్థాయి కార్యకర్తలాగా ప్రవర్తించడం సరికాదని బాలినేని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్