Saturday, November 23, 2024
HomeTrending Newsవచ్చేనెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం : బొత్స

వచ్చేనెలలో జిందాల్ ప్లాంట్ ప్రారంభం : బొత్స

గుంటూరు జిల్లాలో నెలకొల్పిన జిందాల్ పవర్ ప్లాంట్ ను వచ్చేనెలలో ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.  జిందాల్  ప్లాంట్ పనులు 2016లో  ప్రారంభం అయ్యాయని, త ప్రభుత్వం 10 శాతం పనులు మాత్రమే పూర్తి చేసిందని బొత్స వివరించారు.  తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పనులు వేగవంతం అయ్యాయన్నారు.

గుంటూరు నగర శివారు ప్రాంతంలో ఓబుల్ నాయుడుపాలెంలో నిర్మిస్తున్న జిందాల్ ప్రాజెక్టును బొత్స సందర్శించారు. అనంతరం ప్లాంట్ ప్రతినిధులతో భేటి అయ్యారు. మునిసిపల్ శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గుంటూరు జిల్లాకు చెందినా ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి సామర్థ్యం కలిగి ఉండే ఇలాంటి ప్లాంట్ ను విశాఖ లో కూడా నిర్మిస్తున్నారని బొత్స చెప్పారు.  గుంటూరు, మంగళగిరి, విజయవాడ, తాడేపల్లి కార్పొరేషన్ సహా మరో 6 మునిసిపాలిటీల్లో సేకరించే  చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్