Thursday, March 12, 2026
HomeTrending Newsఅతి త్వరలో ఐటీ పాలసీ: మంత్రి గౌతమ్ రెడ్డి

అతి త్వరలో ఐటీ పాలసీ: మంత్రి గౌతమ్ రెడ్డి

రాష్ట్రంలో ఐ ఐ పాలసీని అతి త్వరలో విడుదల చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే ఎలక్ట్రానిక్ పాలసీ విడుదల చేశామని, ఈ నెల 24న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అనంతరం ఐ.టీ పాలసీపై పూర్తి స్పష్టత వస్తుందని వివరించారు.

విజయవాడ ఆర్ అండ్ బి సముదాయంలోని ఏపీటీఎస్ కార్యాలయంలో ఐటి శాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డిగారి సమావేశమయ్యారు. ఐ.టీ పాలసీకి తుది మెరుగులు దిద్దే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఐ.టీ. శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఐ.టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, జాయింట్ సెక్రెటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

‘వర్క్ ఫ్రం హోం’పై ప్రత్యేక దృష్టి:
రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రం హోమ్ అమలుకు కావాల్సిన వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఐ.టీ పాలసీ ద్వారా కంపెనీలకి అందించే ప్రోత్సాహకాలను ఎలా ఉండాలన్న అంశంపై అంశంపై కసరత్తు చేస్తున్నామని మేకపాటి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఐ.టీ ఉద్యోగుల వివరాలపై ప్రత్యేక సర్వే నిర్వహించామని, వాలంటీర్ల ద్వారా సర్వే పూర్తి చేయడానికి దిశానిర్దేశం చేశామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రస్థాయిలో ఐ.టి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుందన్నారు. 0.3 శాతం ఉన్న ఐ.టీ వృద్ధి రేటును 5 శాతానికి చేర్చే లక్ష్యంతో పని చేస్తున్నామని గౌతం రెడ్డి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular