Tuesday, March 10, 2026
HomeTrending Newsఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ

ఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ

Surprise Inspection   ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు. వివరాలు అడిగి తెల్సుకున్న మంత్రి… ఆ డాక్టర్‌పై అక్కడిక్కడే సస్పెన్షన్ వేటు వేశారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గైనకాలజి వార్డులో ప్రతి రోజూ స్కానింగ్ నిర్వహించాలని… అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గైనకాలజి వార్డులో సదుపాయాలను పరిశీలించిన మంత్రి హరీష్ రావు… 60 శాతం పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పెంచాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో తిరుగుతూ వైద్య సేవలు ఎలా అందుతున్నాయా?.. సదుపాయాలు ఎలా ఉన్నాయి అంటూ మంత్రి హరీష్‌రావు పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular