Monday, January 20, 2025
HomeTrending Newsబొట్టు బిళ్లకు ఆసరా పెన్షన్ కు పోటీ

బొట్టు బిళ్లకు ఆసరా పెన్షన్ కు పోటీ

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెడుతుంటే.. మన కేసీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేంద్రం మన రాష్ట్రానికి లేఖ రాసిందని, మేము అమ్ముతున్నాం, మీరు కూడా అమ్మితే బహుమానాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసిందన్నారు. హుజురాబాద్ లో జరిగిన రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ ఆస్తులు కూడబెడుతుంటే.. ఉన్న ఆస్తులను అమ్మకానికి పెడుతున్నది బీజేపీ ప్రభుత్వమని విమర్శించారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలకు మేలు కావాలని ఏమన్నా రాజీనామా చేసాడా అన్న మంత్రి హరీశ్ రావు ఒక వేళ ఈటల గెలిస్తే.. వ్యక్తిగా ఆయనకు మేలు జరుగుతుందన్నారు. 2లక్షల 29 వేల మందికి మేలు జరగాలా.. ఒక్క ఈటలకే మేలు జరగాలా అని ప్రశ్నించారు.

ఈటలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రస్టేషన్ తో నాపై కూడా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నార మంత్రి హరీశ్ రావు అన్నారు. అది  ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు. నేనేంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎన్నిసార్లు అరెస్టయ్యానో, ఎంత నిజాయితీగా తెలంగాణ కోసం కొట్లాడానో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే  అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరేసి వచ్చిన నేను క్రమశిక్షణ కలిగిన టీఆర్ఎస్ కార్యకర్తనని, పేద ప్రజలకు అందుబాటులో ఉండి  ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ మాట తప్పని వ్యక్తినని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

4 వేల ఇళ్లు మంజూరు చేస్తే ఈటల రాజేందర్  ఒక్కటి కూడా పూర్తి చేయలేదని చెప్పాను. ఆయనతో పాటు ఇళ్లు మంజూరు చేయించుకున్న మంత్రులంతా గృహప్రవేశాలు చేయించారు. ఈటల మాత్రం చేయలేదని చెప్పానని మంత్రి హరీశ్ రావు వివరించారు. బొట్టు బిళ్లకు ఆసరా పెన్షన్ కు పోటీ అన్న మంత్రి హరీశ్ రావు ఓక వ్యక్తి ప్రయోజనం కంటే హుజురాబాద్ ప్రజల ప్రయోజనం గొప్పదన్నారు. బీజేపీ నేతలు గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని, మీరేం చేస్తారో చెప్పాలి గానీ.. వ్యక్తిగతంగా తిడితే ఏమొస్తొందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్