Wednesday, May 7, 2025
HomeTrending Newsవరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి ప‌ర్యటించారు. నిర్మల్ పట్టణంలోని మంజూలా పూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ కాలనీల‌ను మంత్రి ప‌రిశీలించారు. జోరు వానలోనే ప‌లు కాల‌నీల‌లో ప‌ర్యటిస్తూ అధికారులకు సూచనలిస్తూ.. మంత్రి ప్రజలకు భరోసా క‌ల్పించారు. కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు.
సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్‌ చరిత్రలో ఎన్నడు ఇంత‌టి వ‌ర్షం కుర‌వ‌లేద‌న్నారు. ప‌లు కాల‌నీలు జ‌ల‌మయ్యాయ‌ని, ప్రజలు ఆందోళ‌న చెందొద్దని సూచించారు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు కూడా బాధితుల‌కు సహాయం చేయాల‌ని కోరారు. జిల్లా అధికారుల‌తో మంత్రి కలెక్టరేట్‌ కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వహించారు. ఈ వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వర్షాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముంద‌స్తు చర్చలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్