భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్ అదేశాలిచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. నిన్నటి (జులై 22) వరకు 200.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు.
కర్నూల్, అనంతపురం, చిత్తూరు, కడప, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లో పంట పొలాలు ముంపుకి గురయ్యాయని, వర్షం నిలిస్తే ఆ నీరు పోయే అవకాశం ఉందని కన్నబాబు తెలిపారు. వర్షాలు తగ్గితే పంట నష్టాన్ని అంచనా వేస్తామని, రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందిస్తామని అన్నారు. ఈ వర్షాలు ఖరీఫ్ కు కలిసొచ్చే అంశంమని కన్నబాబు అభిప్రాయపడ్డారు.