Saturday, January 18, 2025
HomeTrending Newsఐఐటి విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం

ఐఐటి విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక సాయం

వరంగల్ జిల్లా  హసన్ పర్తి కి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండు సంవత్సరాల క్రితం ఐఐటీలో సీటు దక్కించుకుంది. అయితే కుటుంబ పేదరికం,  ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని మంత్రి కేటిఆర్ ను కోరింది. మేకల అంజలి పేదరిక పరిస్థితులను తెలుసుకున్న మంత్రి కే. తారక రామారావు తన వ్యక్తిగత హోదాలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆమె ఫీజులకు అవసరమైన నిధులను అందిస్తూ వస్తున్నారు.

మేకల అంజలి ప్రస్తుతం ఐఐటి ఇండోర్ లో చదువుతుంది. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటి ఫీజుల మొత్తాన్ని ఈరోజు మంత్రి కే. తారకరామారావు అంజలి కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ తమ కూతురు ఐఐటి విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్