Friday, November 22, 2024
HomeTrending NewsTRS ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు: మంత్రి కేటీఆర్‌

TRS ఎంపీల సస్పెన్షన్‌ సిగ్గుచేటు: మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ జిహెచ్ఎంసి, జలమండలి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని సూచన. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాల పైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలన్నారు.

హైదరాబాద్ నగరం మరియు పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ/తగ్గింపు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలని మంత్రి ఆదేశించారు.

రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్‌ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.
‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎందుకు’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.

జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసన తెలిపిన 19 మంది విపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్‌ వారం రోజులపాటు సస్పెండ్‌ చేశారు. వీరిలో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌, దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. మిగిలిన 16 మందిలో ఏడుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు, ఆరుగురు డీఎంకే ఎంపీలు, ఇద్దరు సీపీఎం ఎంపీలు, ఒక సీపీఐ ఎంపీ ఉన్నారు.

Also Read : జంట జలాశయాలకు పోటెత్తిన వరద

RELATED ARTICLES

Most Popular

న్యూస్