Tuesday, March 10, 2026
HomeTrending NewsDouble Bed Room: ఆగస్టులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ- మంత్రి కేటీఆర్

Double Bed Room: ఆగస్టులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ- మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తున్నదని, ఇప్పటికే ఇందులో అత్యధిక భాగం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి సంబంధించి జిహెచ్ఎంసి ఒక షెడ్యూల్ సిద్ధం చేసింది. లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి సంబంధించిన అంశంలో రెవెన్యూ యంత్రాంగం నుంచి మద్దతు తీసుకొని ముందుకుపోనున్నది.

ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందేలా చూడాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్ ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా ఇన్ సిట్యూ (in -situ) ప్రాంతాల్లో నిర్మించిన దాదాపు నాలుగు వేల ఇండ్లకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు అందించింది. జిహెచ్ఎంసి రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ మూడవ వారం వరకు కొనసాగుతుంది. దాదాపు 6 దశల్లో ఇప్పటికే పూర్తయిన సుమారు 65 వేల కు పైగా పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తారు. వీటికి అదనంగా నిర్మాణం తుది దశలో ఉన్న ఇండ్లను కూడా ఎప్పటికప్పుడు ఈ పంపిణీ కార్యక్రమానికి అదనంగా జత చేసే అవకాశం ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular