Friday, January 24, 2025
HomeTrending Newssiddipet : సిద్దిపేట‌లో ఐటీ టవర్ ప్రారంభం

siddipet : సిద్దిపేట‌లో ఐటీ టవర్ ప్రారంభం

తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ రంగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేశారు. సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవ‌ర్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు, ఐటీ మంత్రి కేటీఆర్‌ క‌లిసి గురువారం (జూన్ 15) ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. క‌లలో కూడా సిద్దిపేట‌కు ఐటీ హ‌బ్ వ‌స్తుంద‌ని ఎవరైనా అనుకున్నామా? అని అన్నారు. తెలంగాణ రాకపోయి ఉంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఐటీ సంస్థలు ఇక్కడికి వచ్చేవా అని అన్నారు. త్వరలోనే సిద్దిపేటలో టీ హబ్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఈ ఐటీ ట‌వ‌ర్ ప్రారంభం వల్ల సిద్దిపేట‌లో 1500 మందికి ఉద్యోగాలు ఏర్పడ్డాయని అన్నారు. ‘‘సిద్దిపేట‌కు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఐటీ ట‌వ‌ర్ ప్రారంభం రోజునే సంస్థలు వ‌చ్చి ఉద్యోగాలు ఇవ్వ‌డం చాలా గొప్ప. ఐటీ హ‌బ్‌కు మ‌రిన్ని నిధులు మంజూరు చేసి విస్త‌రిస్తాం. సిద్దిపేట‌లో టీ హ‌బ్ కూడా ఏర్పాటు చేస్తాం. 2014లో రాష్ట్రంలో ఐటీ ఎగుమ‌తులు కేవ‌లం రూ.56 వేల కోట్లు మాత్ర‌మే అని, ఇవాళ రూ. 2.41 ల‌క్ష‌ల కోట్లకు ఐటీ ఎగుమ‌తుల‌కు చేరుకున్నామ‌ని కేటీఆర్ మరోసారి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్