జూనియర్ డాక్టర్లు(జూడా) వెంటనే సమ్మె విరమించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె చేయడానికి ఇది తగిన సమయం కాదని అభిప్రాయపడ్డారు. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె విరమించకపోతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేటియార్ అన్నారు
ఇటీవలే 15 శాతం స్థాయి స్టైఫండును పెంచామని, మిగిలిన డిమాండ్లపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు, ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను అర్ధం చేసుకొని వెంటనే అన్ని సేవలకూ హాజరు కావాలని సూచించారు.
మరోవైపు జూడాలు మాత్రం సమ్మె విరమిచేది లేదని స్పష్టం చేస్తున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం స్తైఫండు పెంపుపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని, మిగిలిన మూడు డిమాండ్లపై కూడా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరుతున్నారు. లేనిపక్షంలో 28 నుంచి కోవిడ్, అత్యవసర సేవలు కూడా బహిష్కరిస్తామని వెల్లడించారు.