Thursday, March 12, 2026
HomeTrending NewsSiricilla: సిరిసిల్ల మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి

Siricilla: సిరిసిల్ల మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి, సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు కే. తారక రామారావు సిరిసిల్ల జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్  ఆధ్వర్యంలో జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్ ని కేటాయించడంతోపాటు దానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

జిల్లాకు ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్… దాని కోసం ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రిని 300 పడకల మేర భారీ ఎత్తున విస్తరించేందుకు కెసిఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పట్ల ప్రత్యేక అభిమానంతో ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తాజాగా సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB)అనుమతులను ఇచ్చింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ను ప్రారంభించుకొని, 100 ఎంబిబిఎస్ సీట్లకు అడ్మిషన్లను స్వీకరించనున్నారు. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular