Sunday, February 23, 2025
HomeTrending NewsProfessional Farmers: మీరే తెలంగాణ భవిష్యత్: యువ రైతులకు మంత్రి కితాబు

Professional Farmers: మీరే తెలంగాణ భవిష్యత్: యువ రైతులకు మంత్రి కితాబు

ఎంటెక్ చేసి బొప్పాయి సాగు, లండన్ ఉద్యోగం వదిలి అవకాడో పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.

అగర్ మియా గూడ యువరైతు అదీప్ అహ్మద్ ను  ఎంటెక్ చదివి 10 ఎకరాలలో బొప్పాయి, జామ, దొండ, వరి సాగు చేస్తున్నారు.  మొజాయిక్ వైరస్ తో బొప్పాయి సాగుకు రైతులు దూరమవుతున్న నేపథ్యంలో దేశీ బొప్పాయి సాగుతో కేజీ రూ.30కి అమ్ముతూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారని మంత్రి కితాబిచ్చారు.

సివిల్ ఇంజనీరింగ్ చేసి లండన్ లో ఎంబీఏ చదివి ఉద్యోగం వదిలేసి ఎకరా 10 గుంటలలో అవకాడో పంట పండిస్తున్న కందుకూరు మండలం దెబ్బడగూడ తండా వాసి జైపాల్ నాయక్ ను కూడా మంత్రి ప్రశంసించారు.  ఎకరాకు రూ.5 నుండి రూ.10 లక్షల వరకు లాభాలున్నాయని, అవకాడో పంట సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారని అన్నారు.

యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను లక్ష మంది సబ్ స్క్రైబర్లతో విజయవంతంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్.

మీలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శమని,  వ్యవసాయమే ఈ ప్రపంచ దిక్సూచి .. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని మంత్రి పెర్కొన్నారు.  “సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి.  సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాలి. సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలి .. దానికి మీరు పునాదిరాళ్లు .. మీ నేతృత్వంలో మరింతమందిని ఇటు వైపు మళ్లించాలి” అని మంత్రి వారికి సూచించారు.

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన యువరైతులు అదీప్ అహ్మద్, జైపాల్ నాయక్ , యూ ట్యూబర్ శివకుమార్ నిరంజన్ రెడ్డిని కలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్