Sunday, November 24, 2024
HomeTrending Newsటీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: పెద్దిరెడ్డి

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: పెద్దిరెడ్డి

తెలుగుదేశం పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తాము కూడా వీధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి ఉంటుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. తమ కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు పంతుతున్నామని, సీఎం జగన్ విదేశాలకు పారిపోయాడని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ధ్వజమెత్తారు.

లోకేశ్ తనను పాపాల పెద్దిరెడ్డి అంటుంటాడని… వాస్తవానికి ఆయన తండ్రి పాపాల చంద్రబాబు అని, వంగవీటి రంగా నుంచి పింగళి దశరథరామ్ వరకూ ఎందరినో ఆయన చంపించారని మండిపడ్డారు. తాను పాపాల పెద్దిరెడ్డినా, మంచి పెద్దిరెడ్డినా అనేది రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అందరికీ తెలుసని, రాజకీయ విలువలను దెబ్బతీసే విధంగా దుర్భాషలాడడం తగదని సూచించారు.  రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి, జూన్ 4న ఫలితాలు వెలువడుతున్నాయని, ఈ తరుణంలో టీడీపీ లేనిపోని అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందని విమర్శించారు. వాహనాల్లో వేల కోట్ల డబ్బు, వజ్రాలను ఇతర దేశాలకు తరలిస్తున్నారని నారా లోకేశ్ ట్వీట్ చేయడం చూస్తుంటే…. ఇలాంటి ఆరోపణలు చేసేముందు లోకేశ్ వాస్తవాలు గమనించాలా, లేదా? ఆయన్ను  పప్పు అని ప్రజలందరూ ఎందుకు పిలుస్తారో ఈ ట్వీట్ ను చూస్తేనే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు,

ఆ వాహనాలు ఆఫ్రికాలో తాము చేసున్న ప్రాజెక్టు వద్దకు పంపిస్తున్నామని, దారుస్సలామ్ పోర్టుకు వద్దకు వెళుతున్నాయిని, వాహనాల్లో మేం ఏవైనా పంపిస్తుంటే ఇక్కడ, అక్కడ కూడా కస్టమ్స్ తనిఖీలు ఉంటాయని అలాంటప్పుడు వాటిల్లో డబ్బులు పెట్టేందుకు లోకేశ్ వంటి మూర్ఖులు తప్ప ఎవరూ సాహసించరని ఎద్దేవా చేశారు. చార్టర్డ్ విమానాల్లో సూట్ కేసులు సింగపూర్, దుబాయ్ పంపుతూ ఉండడ్డం వారికి అలవాటనిఅందుకే మాపై కూడా అలాంటి ఆరోపణలే చేస్తున్నారని ధ్వజమెత్తారు.

వైసీపీ నేతలు చాలామంది విదేశాలకు పారిపోయేందుకు పాస్ పోర్టులు రెడీ చేసుకున్నారంటూ దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై కూడా పెద్దిరెడ్డి స్పందించారు. “మా నాయకుడు జగన్ విదేశాలకు వెళితేనేమో ఆయన పారిపోయినట్టు. వాళ్ల నాయకుడు చంద్రబాబు వెళితే వైద్య పరీక్షల కోసం వెళ్టినట్టంట. ఇలాంటి రాతలు రాసే పచ్చ పత్రికలు ఉన్నాయి కాబట్టే టీడీపీ వాళ్లు ఇలా మాట్లాడుతున్నారు. ఉమా నీకు బుద్ధి ఉందా? చంద్రబాబు దగ్గర ఏం తప్పు చేశావో. ఐదేళ్లు మంత్రిగా చేసి కూడా కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు? నీ నియోజకవర్గంలో మా పార్టీ నుంచి వెళ్లిన నేతకు టికెట్ ఇచ్చారు. నువ్వు అంతకంటే అసమర్థుడివి కాబట్టే నీకు టికెట్ ఇవ్వలేదని అర్థమవుతోంది” అంటూ నిప్పులు చెరిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్