చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు వైభవంగా ప్రారంభమయ్యాయి. 21 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 8న తెప్పోత్సవంతో ముగుస్తాయి.
నేడు మొదటి రోజు ‘వినాయక చవితి’ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు నిర్వహించి,దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఎం.ఎస్ బాబు, వెంకటే గౌడ, కలెక్టర్ షాన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.