AP Tribute to Sirivennela:
సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నివాళులర్పించారు. నిన్న సాయంత్రం 4.07 గంటలకు మరణించిన సిరివెన్నెల భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్ధం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఫిలింనగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉంచారు. తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గీత రచయితలు, గాయకులు సిరివెన్నెల భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన పేర్ని సిరివెన్నెలకు ఘనంగా నివాళులు అర్పించారు. సిరివెన్నెల తన పద విన్యాసంతో సినీ పరిశ్రమపైనే కాకుండా తెలుగు భాష తెలిసిన ప్రతి ఒక్కరి మదిలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని మంత్రి పేర్ని కొనియాడారు.