Another one: రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశాలున్నాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలన్నీ కలిపి కోట జిలాగా ఏర్పాటు చేసే అంశాన్ని సిఎం జగన్ పరిశీలిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో 43 సంవత్సరాల తర్వాత కొత్త జిలాలు ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని మన్యం ప్రాంతాన్ని మొత్తం మూడు జిల్లాలుగా చేయాలనే ఆలోచన ఉందని, ఇప్పటికే రెండు చేశారని , మరో జిల్లా ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై సిఎం జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని పేర్ని వివరించారు. దీనితో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందన్నారు.