Saturday, November 23, 2024
HomeTrending Newsరాజకీయ విషసర్పం బాబు : రాంబాబు  విమర్శ

రాజకీయ విషసర్పం బాబు : రాంబాబు  విమర్శ

Open for debate: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి టిడిపి చారిత్రక తప్పిదమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లు పూర్తిగా నిర్మించకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మించారని, వరద వచ్చి ఇది కొట్టుకుపోయిందని చెప్పారు. 2018  డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మీరు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ విషయంలో టిడిపి నుంచి ఎవరు బహిరంగ చర్చకు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని రాంబాబు సవాల్ విసిరారు.

గతంలో తమ పాలనలో చేసిన తప్పులపై చర్చించకుండా, బీసీలను చేసిన మేలు ఏమిటో చెప్పకుండా,  ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా మహానాడులో నేతల ప్రసంగాలు సాగాయని రాంబాబు విమర్శించారు. కోనసీమలో ఓ దళిత మంత్రి, ఓ బీసీ ఎమ్మెల్యే ఇంటిని దహనం చేస్తే ఎందుకు మహానాడులో ఖండిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని రాంబాబు నిలదీశారు. టిడిపి దళిత ద్రోహుల పార్టీగా మిగిలిపోతుందన్నారు. ఈ మహానాడు అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతోందన్నారు.  తమ మంత్రులు బస్సు యాత్ర చేస్తుంటే…  మహానాడులో ఓ మహిళా కార్యకర్త మా మంత్రులను చెంపలు వాయిస్తానని అంటుంటే బాబు ఎందుకు వారించలేకపోయారని రాంబాబు అడిగారు.

ఎంతోమందిని రాజకీయంగా చంపేసిన విషసర్పం చంద్రబాబు అని రాంబాబు ఘాటుగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీని చంపేయండి- రాష్ట్రాన్ని కాపాడండి అనే నినాదాన్ని ఇస్తున్నామని,  రాజకీయంగా ఎన్నో దుష్ట సంప్రదాయాలు తీసుకువచ్చిన ఇలాంటి నేత చంద్రబాబు అని, అందుకే ఈ నినాదం ఎత్తుకోవాల్సి వచ్చిందన్నారు. తెలంగాణాలో  టిడిపిని చంపేశారని, ఇక్కడ కూడా కొనఊపిరితో కొట్టుమిట్టాడు తోందన్నారు రాంబాబు.  తమ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని. ఎల్లో మీడియా, టిడిపి నేతలు బస్సు యాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంబాబు ధ్వజమెత్తారు.  మహానాడుతో భ్రమలకు పాల్పడుతూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారని, కానీ ప్రజలు వారికి అధికారం ఇచ్చే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : పోలవరం ఇంచు కూడా తగ్గించం: జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్