Sunday, January 19, 2025
HomeTrending Newsవిల్లు పట్టిన ఆర్కే రోజా

విల్లు పట్టిన ఆర్కే రోజా

Busy Roja: రాష్ట్ర వ్యాప్తంగా 1670 సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖ మంత్రి ఆర్.కే. రోజా వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి స్పోర్ట్స్ క్లబ్ లు ప్రారంభిస్తున్నామని, మొదటిసారిగా వాటర్ స్పోర్ట్స్ కూడా ఈ క్యాంపుల్లో నిర్వహిస్తున్నామని చెప్పారి.

విజయవాడలోని  ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఏపీ శాప్) ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను  రోజా  ప్రారంభించారు.  ఈ కార్యక్రమం లో విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు  మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్, ఐఏఎస్, విద్యాశాఖ కమిషనర్ సురేష్, ఐఏఎస్, శాప్ డైరక్టర్, ఎన్. టీ. ఆర్. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఐఎఎస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నీల్ దినకర్ ఐఎఎస్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆర్కే రోజా వరుస పర్యటనలతో… తీరిక లేని కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. క్రీడా శాఖ మంత్రిగా కూడా ఉన్న ఆమె మొన్న మే 1న పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని ఆమె కూడా కాసేపు  ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. నేడు కూడా ఆమె బాస్కెట్ బాల్, క్రికెట్ బ్యాట్, విల్లుతో కాసేపు ఆటలు ఆడి అందరినీ అలరించారు.

Also Read : నిజాలు తెలుసుకొని మాట్లాడాలి: రోజా సూచన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్