Friday, November 22, 2024
HomeTrending Newsపాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి

పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి

పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ఉపాధ్యాయులను సమాయత్తం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులకు ఆదేశించారు. అన్ని విభాగాల అధిపతులు,రాష్ట్రంలో ని అన్ని యూనివర్సిటీ ల వైస్ ఛాన్సలర్స్, జిల్లాల డిఈఓ లు,డిఐఓ లు,ఇతర అధికారుల తో మంత్రి వర్చువల్ మీట్ ద్వారా మాట్లాడారు. విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ,ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింభాద్రితో కలిసి వర్చువల్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి అన్ని స్థాయిలలో విద్యాలయాలు ప్రారంభం అవుతుండటంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుధ్య,శానిటైజేషన్, పనులు పూర్తి చేయాలని,తాగు నీరు,విద్యుత్ సౌకర్యాల పునరుద్ధరణ తదితర వాటిపై దృష్టి పెట్టాలన్నారు.

ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని,సహకరించని వారి వివరాలు తమ పై అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల కోసం శానిటైజర్ అందుబాటులో ఉంచాలని,మాస్క్ లు పెట్టుకునేల చూడాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరైనా జ్వరం,జలుబు లాంటి లక్షణాలు ఉంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందాలన్నారు. అదే విధంగా వైరల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హాస్టళ్లను కూడా ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.

పాఠశాలల ప్రారంభానికి ఇంకా ఒక రోజే మిగిలి ఉండగా,పలు చోట్ల పనులు పూర్తి కాలేదని దృష్టికి వచ్చిందని,మంగళవారం సాయంత్రానికి అన్ని విద్యాలయాలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రయివేటు విద్యా సంస్థల పై కూడా దృష్టి పెట్టాలని, వాటిలో కూడా కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు.ట్రాన్స్ పోర్ట్ సమయంలో నే అత్యంత జాగ్రత్తలు పాటించాలన్నారు.బస్ లలో శానిటైజేషన్ ప్రతి రోజు చేసేలా చూడాలన్నారు.చాలా రోజుల తర్వాత పాఠశాలలకు విద్యార్థులు వస్తున్నందున వారు వాతావరణానికి అలవాటు పడేలా చూడాలన్నారు.ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్