Saturday, November 23, 2024
HomeTrending Newsపది,ఇంటర్‌ పరీక్షలపై మంత్రి సబితా రెడ్డి సమీక్ష

పది,ఇంటర్‌ పరీక్షలపై మంత్రి సబితా రెడ్డి సమీక్ష

10th Inter Exams : పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు టెట్‌ నిర్వహణపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ సన్నద్ధదతపై చర్చించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు వచ్చే నెల 6 నుంచి 24 వరకు జరుగనున్నాయి. అదేవిధంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరుగుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) జూన్‌ 12న నిర్వహించనున్నారు.

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌..

ఇంటర్‌ ఫ‌స్టియ‌ర్
మే 6 (శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 9 (సోమ‌వారం) – ఇంగ్లీష్
మే 11 (బుధ‌వారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
మే 13 (శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్టరీ
మే 16 (సోమ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
మే 18 (బుధ‌వారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
మే 20 (శుక్రవారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1
మే 23(సోమ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి

ఇంటర్‌ సెకండియ‌ర్
మే 7 (శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 10 (మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్
మే 12 (గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్
మే 14 (శ‌నివారం) – మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్టరీ
మే 17 (మంగ‌ళ‌వారం) – ఫిజిక్స్, ఎక‌నామిక్స్
మే 19 (గురువారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్
మే 21 (శ‌నివారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2
మే 24 (మంగ‌ళ‌వారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి

Also Read : నిరుద్యోగులకు తీపి కబురు  

RELATED ARTICLES

Most Popular

న్యూస్