Be responsible: రేపల్లె అత్యాచార సంఘటనను రాజకీయం చేయడం తగదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. ఈ ఘటన అత్యంత హేయమైనదని, హృదయాలను కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమని, ఈ విషమైన దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తరఫునుంచి బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రైల్వే స్టేషన్లో భద్రతపై ఆదికారులతో సంప్రదించి, సమన్వయం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
అయితే ఎక్కడ ఏ సంఘటన జరిగినా విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని, ఇది తగదని, బాధితుల మానసిక స్థాయిర్యం దెబ్బ తినకుండా మానవతా దృక్పథం తో వ్యవహరించాలని సురేష్ విజ్ఞప్తి చేశారు. బాధితుల సమాచారాన్ని, వివరాలను గోప్యంగా ఉంచాలన్న కనీస నైతిక విలువలు కూడా టిడిపి నేతలు పాటించడంలేదని విమర్శించారు. ఇది ఎవరి నియోజకవర్గంలోకి వస్తుంది, ఎవరిపై విమర్శలు చేయాలా అనే అంశాలపైనే టిడిపి ఆలోచిస్తోందని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఘటనలు వాడుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాధ్యతగా నిన్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పరామర్శించారని, నేడు హోం మంత్రి వచ్చి బాధితురాలికి ధైర్యం చెబుతారని… అలాగే టిడిపి మహిళా నేతలు వస్తే వారికి కూడా బాదితురానిలి కలిసే అవకాశం పోలీసులు కల్పిస్తారని వివరించారు. అలాకాకుండా భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వచ్చి తాము లోపలి వెళ్తామని ఆందోళన చేయడం సరికాదన్నారు. కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించడం టిడిపి నేతలకు మంచిది కాదన్నారు. తాను కూడా లోపలికి వెళ్లలేదని, బైటు నుంచే చూసి కుటుంబ సభ్యులతో మాట్లాడానని మంత్రి సురేష్ వివరించారు.
Also Read : రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష