నాలాల పై ఉన్న ఆక్రమణల తొలగింపుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నాలాల్లో పూడిక తొలగింపు పనుల పర్యవేక్షన కోసం చేపట్టిన వారం రోజుల స్పెషల్ డ్రైవ్ లో మంత్రి తలసాని పాల్గొన్నారు.
రెండో రోజు బంజారాహిల్స్ రోడ్ నెం-1 లోని బల్కాపూర్ నాలా లో పూడిక తొలగింపు పనులను మంత్రి తలసాని, నాంపల్లి MLA జాఫర్ హుస్సేన్ లు జోనల్ కమిషనర్ ప్రావిణ్యతో కలిసి పరిశీలించారు. 1.65 కిలోమీటర్ల మేర పూడిక తొలగింపు పనులను 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగిందని, ఇందులో 80 శాతం కు పైగా పనులు పూర్తి అయినట్లు మంత్రి వెల్లడించారు.
నాలా పై పెన్షన్ ఆఫీస్ సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణం వలన నీరు నిలిచిపోతుందని స్థానికులు మంత్రికి పిర్యాదు చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాన్ని తొలగించి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ప్రావిణ్య ను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక కార్పొరేటర్ అహ్మద్ సర్ఫరాజ్ సిద్దిఖ్, DC ఇంతేషాప్ అలీ, SE రత్నాకర్, EE లాల్ సింగ్ తదితరులు ఉన్నారు.