Saturday, November 23, 2024
HomeTrending NewsJain Bhavan;దర్యాప్తు సంస్థలతో వేదింపులు-మంత్రి తలసాని

Jain Bhavan;దర్యాప్తు సంస్థలతో వేదింపులు-మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారం ఉప్పల్ భగాయత్ లో జైన భవన్ కోసం కేటాయించిన 2 ఎకరాల స్థలంలో భవన నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. భవన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో MLA లు సుభాష్ రెడ్డి, సుదీర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, జైన్ సేవా సంఘ్ అద్యక్షులు యోగేష్, హిమాన్షు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగ, వ్యాపారాల రిత్యా నగరానికి వచ్చి నివసిస్తున్నారని, వారందరికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అండగా ఉంటూ అభివృద్దికి సహకరిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంస్కృతి, ఆచారాలను ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.

తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రైవేట్ దేవాలయలాకు కూడా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించినట్లు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా 1200 కోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి దేవాలయాన్ని KCR ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. తమ ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తూ ప్రజల మన్ననలను పొందుతుందని పేర్కొన్నారు. కేంద్రంలోని BJP ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, అభివృద్దికి సహకరించడం లేదని విమర్శించారు. ప్రతి పక్ష పార్టీలు, ప్రశ్నించిన వారిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు సంస్థల తో వేదింపులకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిగా ఎన్నికైన 4 సంవత్సరాలలో తనను గెలిపించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం శాంతిభద్రతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న కారణంగానే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.

హైదరాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్ని కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవానాల నిర్మాణం కోసం ప్రభుత్వం భూమి, నిధులు ఇస్తుందని, అందులో భాగంగానే జైన భవనం కోసం కూడా సుమారు 100 కోట్ల రూపాయల విలువైన 2 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి పేద, మద్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకే వైద్య సేవలు అందిస్తున్నదని అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని ప్రభుత్వ లీజు స్థలంలో నిర్వహిస్తున్న మహావీర్ హాస్పిటల్ కు ప్రస్తుతం ఉన్న స్థలాన్ని లీజుపై కాకుండా హాస్పిటల్ కే ముఖ్యమంత్రి శ్రీ KCR కేటాయించారని తెలిపారు. ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ౩౦0 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్