తలపాగా విషయాన్ని కూడా రాజకీయం చేయడం అశోక్ జగపతి రాజుకు తగదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కరోనా దృష్ట్యా అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
సింహాచలం దేవస్థానాన్ని చైర్మన్ హోదాలో అశోక్ గజపతిరాజు నేడు సందర్శించారు, ఈ సమయంలో ఆయనకు తలపాగాను అధికారులు చుట్టలేదు, కరోనా వల్లే కట్టలేకపోయామని అధికారులు సమాధానమిచ్చారు. మంత్రి ఆదేశాలతోనే ఇలా చేశారని అశోక్ జగపతి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేరుతో సంప్రదాయాలను ఉల్లంఘించడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని మంత్రి వెల్లంపల్లి వద్ద ప్రస్తావించగా అసలు అశోక్ గజపతి రాజు ఆలయాన్ని సందర్శించిన విషయమే తనకు తెలియదని, కరోనా జాగ్రత్తల దృష్ట్యా ఈ సంప్రదాన్ని పాటించి ఉండకపోవచ్చని, దీనిపై రాద్ధాంతం చేయడం తగదన్నారు.
పంచ గ్రామాల విషయంలో కూడా అశోక్ గజపతి మాట మారుస్తున్నారని, తెలుగుదేశం పార్టీ హయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అంగీకరించి ఇప్పుడు అలా కుదరదని మాట మారుస్తున్నారని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. ఈ విషయంలో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.