Sunday, September 8, 2024
HomeTrending NewsHealth Camp: జర్నలిస్టు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది: చెల్లుబోయిన

Health Camp: జర్నలిస్టు ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది: చెల్లుబోయిన

సమాజ హితం కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టుల ఆరోగ్యం బాగుండాలన్న దృక్పథంతో 2 రోజుల పాటు ఉచిత జర్నలిస్టుల హెల్త్ క్యాంపు నిర్వహించామని సమాచార, పౌర సంబంధాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. త్వరలోనే విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నామన్నారు. శనివారం విజయవాడలోని ఆంధ్రా లయోలా ఇంజినీరింగ్ కాలేజ్ లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సమాచార, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజినితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రులు, అధికారులు రక్తపరీక్షలు, బీపీ, షుగర్ టెస్ట్ లు చేయించుకున్నారు. జర్నలిస్టులతో చర్చించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ యూనిట్,  మొబైల్ డెంటల్ కేర్ యూనిట్ లను పరిశీలించి సిబ్బంది ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చెల్లుబోయిన మాట్లాడుతూ.. కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ, పనిలో విమర్శలు ఎక్కువ  … ఇలాంటి ఒత్తిళ్లలో కూడా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పిలవబడే మీడియాలో విధులు నిర్వర్తిస్తున్న  జర్నలిస్టుల ఉద్యోగం కత్తిమీద సాములాంటిందన్నారు. పని ఒత్తిడి వల్ల సరైన సమయంలో తినలేక ఆరోగ్యం దెబ్బతినే జర్నలిస్టులు కోకొల్లలన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును ప్రతి ఒక్క జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత హెల్త్ క్యాంపులో దాదాపు 10 వేల రూపాయల విలువగల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు.

మంత్రి విడదల రజిని మాట్లాడుతూ… ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టు పాత్ర సమాజంలో కీలకమైనదన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా జర్నలిస్టుల కష్టం మరవలేనిదన్నారు. ఈ క్రమంలో వారిపై ప్రత్యేక దృష్టి సారించి 10వేల ఖర్చు చేసే వైద్య పరీక్షలన్నీ జరల్నిస్టులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ క్యాంపు ద్వారా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. కుటుంబ సమస్యలు పక్కనబెట్టి, ఆరోగ్య సమస్యలు ఫణంగా పెట్టి సమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టుల ఆరోగ్యాలు బాగుండాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల కోసం త్వరలో మరిన్ని నగరాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నామన్నారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం వన్ స్టాప్ సెంటర్లుగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్  తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం, కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడే జర్నలిస్టుల పాత్ర సమాజంలో కీలకమైనదన్నారు. వార్తల సేకరణ కోసం సరైన సమయంలో తిండి, నిద్రలేక అనారోగ్యం పాలవుతున్న జర్నలిస్టుల సంఖ్య అధికం అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు సమాచార పౌర సంబంధాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సౌజ్యంతో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును ప్రతి జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నిసార్లు ఆరోగ్య పరంగా ఇబ్బంది తలెత్తినా ప్రతిసారి 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు అతి తక్కువ ప్రీమియంతో ఏర్పాటు చేసిన హెల్త్ స్కీంను జర్నలిస్టులు వినియోగించుకోవాలన్నారు. జర్నలిస్టులు రూ.1,250, ప్రభుత్వం తరపున మరో రూ.1,250 చెల్లించడం ద్వారా హెల్త్ స్కీం లబ్ధి పొందవచ్చన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్