ప్రపంచ వారసత్వ సంపద గా యూనెస్కో చే గుర్తింపు పొందిన కాకతీయ కళానైపుణ్యం రామప్ప దేవాలయం ను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, స్థానిక MP మాలోత్ కవిత, MLC శ్రీనివాస్ రెడ్డి, MLA సీతక్కా లతో కలసి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ గార్లు రామప్ప దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప దేవాలయ అద్భుత శిల్ప కళ సంపద ను గైడ్ మంత్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.