Tuesday, March 10, 2026
Homeసినిమా'నా సామిరంగ'లో మెరవనున్న మిర్నా మీనన్!

‘నా సామిరంగ’లో మెరవనున్న మిర్నా మీనన్!

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన హీరోయిన్స్ లో ‘మిర్నా మీనన్’ ఒకరు. 2016 లోనే ఓ తమిళ సినిమాతో ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత మలయాళ సినిమాలు కూడా చేస్తూ, టాలీవుడ్ వైపు వచ్చింది. ‘క్రేజీ ఫెలో’ .. ‘ఉగ్రం’ సినిమాలతో ఆమె తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వలన, అంతగా ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. అయితే ‘జైలర్’ సినిమాలో రజనీ కోడలి పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాంటి మిర్నా మీనన్ ఇప్పుడు ‘నా సామిరంగ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ‘మంగ’ పాత్రను పోషించింది. ఆ పాత్రకి సంబంధించిన పోస్టర్ ను నిన్న రిలీజ్ చేశారు. గ్రామీణ యువతిగా చీరకట్టులో ఆమె ఆకట్టుకుంటోంది. పొలం దగ్గరున్న తన భర్తకు క్యారియర్ తీసుకుని వెళుతున్నట్టుగా ఈ పోస్టర్ లో ఆమె కనిపిస్తోంది. పండుగ వాతావరణానికి కనెక్ట్ అయ్యేలానే ఈ పోస్టర్ ఉండటం విశేషం.

ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా ఆషిక రంగనాథ్ అలరించనుండగా, అల్లరి నరేశ్ సరసన మిర్నా మీనన్ మెరవనుంది. ఇక రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ థిల్లాన్ సందడి చేయనుంది. రీసెంటుగా ఈ ఇద్దరి కాంబినేషన్లో వదిలిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గట్టి పోటీ మధ్య థియేటర్లకు వస్తున్న ఈ సినిమా, ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular