Monday, February 24, 2025
HomeసినిమాMiss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రేపు ఫస్ట్ సింగిల్ విడుదల

Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రేపు ఫస్ట్ సింగిల్ విడుదల

అనుష్క శెట్టి, తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో వస్తోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకుడు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఉగాది పండగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడు పి మహేష్ కుమార్ వాట్సాప్ నుంచి నోనో నో అంటూ సాగే క్యాచీ పదాలను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ను ఉగాది రోజు విడుదల చేయబోతున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. వాటిని అందుకునేందుకు ఈ వేసవి బరిలోనే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్