Sunday, March 15, 2026
HomeసినిమాMiss Shetty Mr Polishetty: 50 కోట్ల క్లబ్ లో.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’

Miss Shetty Mr Polishetty: 50 కోట్ల క్లబ్ లో.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రానికి మహేష్ డైరెక్టర్. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆల్ ఆడియన్స్ ని ఆకట్టుకుని బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఒక కొత్త ప్రయత్నాన్ని మన ఆడియెన్స్ తప్పకుండా రిసీవ్ చేసుకుంటారని ప్రూవ్ చేసిందీ సినిమా. యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇద్దరీకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది.

ఈ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తాజాగా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ మార్క్ కు చేరుకుంది. మూడో వారంలోనూ స్టడీ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. ఆడియెన్స్ ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుందీ సినిమా. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ సినిమా కంటెంట్ ఈజ్ కింగ్ అని.. కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మరోసారి నిరూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular