Saturday, November 23, 2024
Homeసినిమాఈ నెల 29న “మిస్సింగ్” విడుదల

ఈ నెల 29న “మిస్సింగ్” విడుదల

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని భజరంగబలి క్రియేషన్స్ పతాకం పై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లాను ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో హర్షా నర్రా మాట్లాడుతూ  “మా ‘మిస్సింగ్’ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లాను రిలీజ్ చేసిన దర్శకుడు క్రిష్ గారికి చాలా థాంక్స్. అనురాగ్ కులకర్ణి బాగా పాడాడు. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది. థియేటర్ లలో ఈనెల 29న విడుదల చేసేందుకు రెడీ అయ్యాం. థియేటర్ లోనే ఎందుకు అంటే, మిస్సింగ్ మూవీని థియేటర్ లో చూసే ఎక్సీపిరియన్స్ వేరుగా ఉంటుంది. మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్, మేకింగ్ థియేటర్స్ కే కరెక్ట్. మంచి థ్రిల్లర్ మూవీ చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. కమర్షియాలిటీ కోసం అడల్ట్ సీన్స్, ఇతర అంశాలు సినిమాలో ఉండవు. సినిమా చూశాక మీకు నచ్చితే పది మందికి చెప్పండి. సినిమా బాగుందని తెలియాలంటే మౌత్ టాక్ ఇంపార్టెంట్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్ అన్నారు.

నటుడు అశోక్ వర్థన్ మాట్లాడుతూ “ఇటీవల క్రిష్ గారి సినిమా కొండపొలంలో నటించాను. నాకు అవకాశం ఇచ్చిన క్రిష్ గారికి థాంక్స్. అలాగే మా మిస్సింగ్ సినిమా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మిస్సింగ్ సినిమాను మా దర్శకుడు శ్రీని జోస్యుల సూపర్బ్ గా తెరకెక్కించారు. సినిమా అంతా బాగుంటుంది, కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా వచ్చాయి. చిన్న సినిమాకు ప్రేక్షకుల మౌత్ టాక్ చాలా ముఖ్యం. మీకు నచ్చితే మీ ఫ్యామిలీని తీసుకుని మిస్సింగ్ సినిమాకు రండి” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్