Tuesday, September 17, 2024
HomeTrending Newsఆ పార్టీలకు భవిష్యత్ లేదు : దానం

ఆ పార్టీలకు భవిష్యత్ లేదు : దానం

తెలంగాణ లో కనివిని ఎరుగని అభివృద్ధి జరుగుతోంది, కళ్లుండి చూడలేని కబోదులే సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్ళు కెసిఆర్ నుంచి గుంజుకునుడే అంటున్నారని, గుంజుకోవడానికి ఎవని అబ్బ సొత్తు కాదన్నారు. అన్న వారి అబ్బ సొత్తు అసలే కాదని దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, టీ.ఆర్.ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్లో  నిర్వహించిన విలేఖరుల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టారు. రేవంత్ తీరు మూతి లేదు తోక లేదు అన్నట్టుగా ఉందని దానం ఎద్దేవా చేశారు.

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అన్నారు నెహ్రూ.. అదే స్ఫూర్తి తో సీఎం కెసిఆర్ పని చేస్తున్నారన్న దానం నాగేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆధునిక దేవాలయమన్నారు. ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సింది పోయి అదే పనిగా విమర్శలు చేస్తున్నాయన్నారు. గతంలో మేము మంత్రి గా ఉండి చేయలేని అభివృద్ధి హైదరాబాద్ లో ఇపుడు జరుగుతోందన్నారు.

సోషల్ మీడియాకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని, నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్స్ విభాగానికి పిర్యాదు చేశానని దానం తెలిపారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు టీ ఆర్ ఎస్ తోనే ఉంటానని దానం స్పష్టం చేశారు. విధేయత తో కెసిఆర్ ,కే టీ ఆర్ ల నాయకత్వం కిందే పని చేస్తానన్న దానం టీ.ఆర్.ఎస్ పార్టీ యే చిరకాలం తెలంగాణ లో ఉంటుందన్నారు. నా ఇంటికి ఎవరు వచ్చినా టీ.ఆర్.ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందేనని తెలిపారు.

కాంగ్రెస్ ,బీజేపీ లకు తెలంగాణ లో భవిష్యత్ లేదని, టీ ఆర్ ఎస్ లో చిచ్చు పెట్టాలని చూసే వారికి పుట్టగతులు ఉండవన్నారు. రేవంత్ కింద ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్లు ఆలోచించుకోవాలన్న దానం డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న నేత ఎలా పనిచేస్తాడో అందరికి తెలుసన్నారు. సీఎం గా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందన్నారని అలాంటి వారి అంచనాలను సీఎం కెసిఆర్ తలకిందులు చేశారు.

ఉమ్మడి ఏపీ లో అభివృద్ధి జరగనందుకు మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం ..ఆత్మ పరిశీలనతో టీ ఆర్ ఎస్ లో చేరామని దానం చెప్పారు. కాంగ్రెస్ నేతలు బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకు టీ ఆర్ ఎస్ లో చేరాలని, వారికి ఇదే మా ఆహ్వానం అని దానం అన్నారు. కాంగ్రెస్ లో ఎవరైనా చేరడానికి అక్కడ ఏముంది ?. కాంగ్రెస్ లో నాకు అవమానాలు చాలా జరిగాయని దానం వెల్లడించారు. కాంగ్రెస్ కంటే నాకు టీ ఆర్ ఎస్ లో వందింతలు ఎక్కువ గౌరవం దొరుకుతోందని, తెరాస ప్రభుత్వంలో నేను మంత్రి పదవి అడగలేదు, అడగను కూడా అని దానం నాగేందర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్