Saturday, March 14, 2026
HomeTrending Newsచర్లపల్లి జైలుకు ఎమ్మెల్యే రాజాసింగ్

చర్లపల్లి జైలుకు ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సీంగ్  ను కొద్దిసేపటి క్రితం అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు  ఆయన మీద పీడీ యాక్ట్ నమోదు చేశారు. తరుచు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలతో మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజాసింగ్ పై రౌడీషీట్ ఓపెన్ చేశారు. రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న మంగళ హట్ పోలీసులు చెర్లపల్లి జైలుకు  తరలించారు.

ఘర్షణలు చోటు చేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉన్నాయన్న పోలీసులు ఈ నెల 22వ తేదీన రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారాన్నారు. ఓ వర్గాన్ని కించపరిచేలా వీడియోను యు ట్యూబ్ లో పోస్ట్ చేసిన రాజాసింగ్ వల్ల శాంతిభద్ర లకు విఘాతం కలిగిందన్నారు. ఈనెల 23న ఈ కేసులో రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నామని, ఆయన వ్యవహార శైలి మారలేదని పోలీసులు పేర్కొన్నారు.

Also Read : పాత కేసుల్లో రాజాసింగ్ కు పోలీసుల నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular