Sunday, January 19, 2025
HomeTrending Newsరాజసింగ్ వ్యాఖ్యలపై కేటిఆర్ విమర్శ

రాజసింగ్ వ్యాఖ్యలపై కేటిఆర్ విమర్శ

Mla Rajasingh  : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ పార్టీవి దిగజారుడు రాజకీయాలని అన్నారు. యూపీలో ఓటు వేయకపోతే జేసీబీ, బుల్డోజర్లతో ఇళ్లను కూల్చి వేస్తాననడం వారి దిగజారుగుడు తనానికి నిదర్శనమన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలతో మరో హాస్య నటుడు బయపడ్డాడని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ప్రజలు ఎవరైతే బీజేపీకి ఓటు వేయరో, వాళ్లకి నా మనవి. యోగీజీ వేల సంఖ్యలో జేసీబీ, బుల్డోజర్‌లు కొని పెట్టుకున్నాడు. ఎన్నికల తర్వాత ఎవరైతే యోగికి మద్దతు నిరాకరించారో, ఓటు వేయలేదో గుర్తిస్తాం. తెలుసు కదా జేసీబీ, బుల్డోజర్ ఎందుకు పనికి వస్తాయో. అందుకే చెబుతున్నా మీరు యూపీలో ఉండాలనుకుంటే యోగినీ గెలిపించండి, లేదా యూపీని వదిలి పారిపోవాల్సి ఉంటుంది’ అని ఓ వీడియో సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : మోడీ నుంచి కెసిఆర్ కు సుపారి – రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్